దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో నటించిన సుమంత్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. సరైన హిట్స్ లేకపోయినా నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కొంతకాలంగా యాక్టింగ్‌కు గ్యాప్ ఇచ్చిన సుమంత్ రీసెంట్‌గా నిర్మాతగా మారినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మల్లీశ్వర్ అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరో కమ్ నిర్మాత కూడా సుమంతే అని సమాచారం. సబ్జెక్ట్ మీద ఉన్న గట్టి నమ్మకం వల్లే సుమంత్ సొంతగా ఈ సినిమా నిర్మాణం చేపట్టాడని కొందరు చర్చించుకుంటున్నారు. సుమంత్ తండ్రి యార్లగడ్డ సురేంద్ర స్థాపించిన యస్.యస్.క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ కొత్త సినిమా రూపొందబోతోందట. ఇదంతా ఎలా ఉన్నా... హీరోగా సక్సెస్ సాధించేందుకు సుమంత్‌కు ఇదే లాస్ట్ ఛాన్స్ అనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇప్పటికే ఆడియెన్స్ మనోడిని పూర్తిగా మర్చిపోయారని... కొత్త సినిమాతో మెప్పించలేకపోతే... అతడిని మరింతగా లైట్ తీసుకోవడం ఖాయమని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.
http://www.andhrajyothy.com/Pages/cinema_article?SID=175167
No comments:
Post a Comment