పివిపి బ్యానర్‌ఫై అనుష్క, ఆర్య
ప్రధానపాత్రలో నటించిన చిత్రం సైజ్ జీరో. తెలుగు, తమిళ భాషల్లో
వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం నవంబర్ 27న గ్రాండ్ లెవల్‌లో
విడుదలవుతుంది. ఈ చిత్రం క్యారెక్టర్ అనుష్క 20 కిలోల బరువు పెరగడం
అనుష్కకు సినిమాల పట్ట ఉన్న కమిట్‌మెంట్‌ను తెలియజేసింది. అనుష్క ఇలాంటి
డిఫరెంట్ రోల్ చేయడంతో సినిమాపై ప్రేక్షకుల్లో, ట్రేడ్ వర్గాల్లో
ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో పలు సినీ సెలబ్రిటీలు ముఖ్యపాత్రల్లో
కనిపించనున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున, రానా
దగ్గుబాటి,రంగం హీరో జీవా సహా హీరోయిన్స్ హన్సిక, కాజల్ అగర్వాల్,
తమన్నా, శ్రీదివ్య, రేవతి, మంచు లక్ష్మి తదితరులు స్పెషల్
అప్పియరెన్స్‌లో కనపడనున్నారు. ఇంత మంది సినీ సెలబ్రిటీలు ఈ చిత్రంలో
స్పెషల్ అప్పియరెన్స్ చేయడానికి కారణం ఆర్య,అనుష్కలతో వారికున్న
స్నేహ సంబంధమే కాకుండా పెద్ద నిర్మాణ సంస్థ అయిన పివిపి బ్యానర్‌తో ఉన్న
ప్రొఫెషనల్ రిలేషన్ షిప్.
అనుష్క, నాగార్జున నటించిన సూపర్
చిత్రంతో తెరంగేట్రం చేసింది. అప్పటి నుండి నాగ్‌తో అనుష్కకు మంచి స్నేహ
సంబంధాలున్నాయి. అలాగే జీవా, హన్సికలు ఆర్యకు మంచి ఫ్రెండ్స్. అలాగే
శ్రీదివ్య ప్రస్తుతం ఆర్యతో తమిళ బెంగళూర్ డేస్ రీమేక్‌లో నటిస్తుంది.
వీరంతా ఈ చిత్రంలో నటించడం పట్ల చాలా హ్యపీగా ఉన్నారు.
సైజ్ జీరో చిత్రం వెయిట్ లాస్‌కు
సంబంధించిన కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. మనిషి బాహ్య సౌందర్యం కంటే
అంతర్గత సౌందర్యం చాలా ముఖ్యమని చెప్పే ఈ సినిమాలో మనిషికి అంతర్గత
సౌందర్యం ముఖ్యమని నమ్మే కాజల్, హన్సికలు, నేచురల్ బ్యూటీ
మనిషికి చాలా ముఖ్యమని నమ్మే రేవతి కూడా ఇందులో నటించడం పట్ల తమ
సంతోషాన్ని వ్యక్తం చేశారు. అదే విషయాన్ని ఈ చిత్రంలో వీరు తమ మాటల్లో
తెలియజేస్తారు. దర్శకుడు ప్రకాస్ కోవెలమూడికి మంచి మిత్రులైన రానా
దగ్గుబాటి, మంచు లక్ష్మిలు మనిషికి అంతర్గత సౌందర్యమే ముఖ్యమని
నమ్ముతారు. వీరు కూడా ఈ సినిమాలో పార్ట్ కావడం పట్ల చాలా హ్యపీగా
ఉన్నారు.
ప్రకాస్ కోవెలమూడి దర్శకత్వంలో
అనుష్క, ఆర్య ప్రధానపాత్రల్లో రూపొందింది. సినిమా ఫస్ట్‌లుక్ నుండి
మంచి అంచనాలు క్రియేట్ చేసింది. థియేట్రికల్ ట్రైలర్‌ను ఇప్పటికే రెండు
మిలియన్స్ ప్రేక్షకులు వీక్షించారు. యం.యం.కీరవాణి అందించిన సంగీతం
కూడా పెద్ద హిట్టయిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 27న
విడుదలవుతుంది.
SOURCE:CLICK HERE
No comments:
Post a Comment