చెక్కుబౌన్స్ కేసులో
రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌కు ఊరట లభించింది. పాయకరావు
పేట మాజీ ఎం.ఎల్.ఎ. నిర్మాత చెంగల వెంకట్రావుకు అప్పట్లో రూ. 30 లక్షల
చెక్కును విజయేంద్ర ప్రసాద్ ఇచ్చారు. అయితే అది బౌన్స్ కావడంతో వెంకట్రావు
కోర్టును ఆశ్రయించారు. నాలుగేళ్ళ పాటు వాదోపవాదాలు సాగాయి. సరైన
సాక్ష్యాధారాలు లేని కారణంగా గురువారం ఈ కేసును కోర్టు కొట్టి వేసింది.
విజయేంద్ర ప్రసాద్‌కు అనుకూలంగా ఎ.జె.ఎఫ్.సి.ఎం. కోర్టు న్యాయమూర్తి
యజ్ఞనారాయణ తీర్పు నిచ్చారు. మరి దీనిపై చెంగల వెంకట్రావు హైకోర్టును
ఆశ్రయిస్తారేమో చూడాలి.!CLICK HERE FOR SOURCE
No comments:
Post a Comment