Saturday, 21 November 2015

డామినేట్ చేసిన స్టైలిష్ స్టార్ ఇగో

కొత్త యాడ్‌లో డామినేట్ చేసిన స్టైలిష్ స్టార్ ఇగో
 
 
రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి క్యారెక్టర్ లో తెలంగాణ యాసలో అదరగొట్టిన అల్లు అర్జున్.. ప్రస్తుతం బోయపాటి శీను సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా అల్లు అర్జున్ చేసిన ఓ కమర్షియల్ యాడ్ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. యాంకర్ రవితో కలసి చేసిన ఈ యాడ్ లో స్టైలిష్ లుక్ చేసి వావ్ అంటున్నారు బన్నీ అభిమానులు. ఇప్పటికే ఎన్నో యాడ్స్ లో అదరగొట్టిన అల్లు అర్జున్.. మరోసారి ఇరగదీశాడని.. కాకపోతే.. ఇందులో ఇగో డామినేట్ చేసిందని సినీజనాలు మాట్లాడుకుంటున్నారు.
 
అల్లు అర్జున్ నయా ప్రమోషనల్ వీడియోలో ఏ వస్తువును అయినా అమ్ముకోండి అన్నట్లు ఉంది. కానీ మరో యాంగిల్‌లో చూస్తే.. ఇగో కోసం ఏదైనా అమ్మేసుకోండి అని కూడా ఇన్ డైరెక్ట్‌గా చెపుతున్నట్లు ఉందని సినీజనాలు చర్చించుకుంటున్నారు. తన క్రింద ఉద్యోగి.. తనకున్న మోడల్ కారునే కొన్నానని చెప్పడంతే.. ఆ కారును వెంటనే అమ్మేసి.. తన రేంజ్‌కు సూటయ్యే బీఎండబ్లూ కార్‌ను కొనేస్తాడు. ఇది గమనిస్తే.. ఇగో తట్టుకోలేక పాత కారు అమ్మేసి.. కొత్త కారు కొనేసుకున్నట్లు ఉందని సినిమా లవర్స్ మాట్లాడుకుంటున్నారు. 
 

No comments:

Post a Comment